గోదావరిఖని, జూలై 22: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే కానుకగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద విశ్వం ఫంక్షన్‌హాల్‌ను తెలంగాణ కమ్యూనిటీ భవన్‌గా మార్చామని, ఈ నెల 24 నుంచి ఫంక్షన్‌హాలును పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చం దర్ తెలిపారు.
మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లోని విశ్వం ఫంక్షన్హాల్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కేటీఆర్ బర్త్‌డేను గురువారం రామగుండం నియోజకవర్గంలో ఘ నంగా నిర్వహిస్తామని చెప్పారు.