హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్సీవోఆర్) ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చింది. ఈ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. వెంటనే జోన్ కార్యక్రమాలు అమల్లోకి వస్తాయి.
ఈ జోన్లో వాల్తేరు డివిజన్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లు విశాఖ డివిజన్లో విలీనం చేయడం ద్వారా ఏపీలో రవాణ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఇప్పటి వరకు కొనసాగిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇక నుంచి విశాఖ జోన్ కేంద్రంలో విలీనం కానున్నట్టు సమాచారం.