బీజేపీ విభజన రాజకీయాలతో దేశంలో మతహింస : కె. నారాయణ
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీ విభజన రాజకీయలు దేశంలో మతహింసను పెంచుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. దీంతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజన, మైనారిటీలపై ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర దాడులు జరుగుతున్నాయన్నారు.
మఖ్దూం భవన్లో మంగళవారం నిర్వహించిన సీపీఐ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవిద్యభరిత, సుసంపన్న సంస్కృతి, సంప్రదాయాలు కగిలిన భారత దేశాన్ని అఖండ హిందూ దేశంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అందుకోసమే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.
ప్రశ్నించేవారిపై దేశద్రోహం లేదా ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టిస్తున్నారని వాపోయారు. కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలన్నారు. సెప్టెంబర్4 నుంచి 7 వరకు శంషాబాద్‌లో నిర్వహించే పార్టీ మహాసభలను చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా, సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

