క్యాన్సర్‌కు భయపడొద్దు
క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. ఆధునిక వైద్యవిజ్ఞానం, నిరంతర పరిశోధనలు, రోగుల ఆత్మవిశ్వాసంతో వాటిని సమర్థవంతంగా ఎదురోవాలని పిలుపునిచ్చారు.
- ఆత్మవిశ్వాసంతో సమర్థంగా ఎదురోవాలి
- రోగులకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. ఆధునిక వైద్యవిజ్ఞానం, నిరంతర పరిశోధనలు, రోగుల ఆత్మవిశ్వాసంతో వాటిని సమర్థవంతంగా ఎదురోవాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ హాస్పిస్ అండ్ పాలియేటివ్ కేర్ దినోత్సవం, స్పర్శ్ హాస్పిస్ 15వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ.. వైద్యమంటే కేవలం కేవలం వృత్తి మాత్రమే కాదని, మహోన్నత మానవసేవ అని స్పష్టం చేశారు.
క్యాన్సర్ బారిన పడినంతమాత్రాన జీవితం ముగిసినట్టు కాదని, ఆ వ్యాధిని నయం చేసేందుకు ఎన్నో మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ముందస్తు పరీక్షలు, సరైన వైద్యసలహాలు, కుటుంబసభ్యుల మానసిక తోడ్పాటు క్యాన్సర్ రోగులను వేగంగా కోలుకునేలా చేస్తాయని, మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు, సకాలపు స్రీనింగ్ ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాలియేటివ్ కేర్ పట్ల ఉన్న అపోహను సమాజం విడనాడాలని, తీవ్ర అనారోగ్యానికి గురైనవారి నొప్పిని తగ్గించడం, వారి జీవన నాణ్యతను పెంచడమే పాలియేటివ్ కేర్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పాలియేటివ్ కేర్ రంగంలో గత 15 ఏండ్ల నుంచి నిస్వార్థ సేవలు అందిస్తున్న స్పర్శ్ హాస్పిస్ ట్రస్టు సభ్యులు, వైద్యులు, సిబ్బంది, రోటరీ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. స్పర్శ్ హాస్పిస్ లాంటి స్వచ్ఛంద సంస్థలను సమాజం, దాతలు మరింత ప్రోత్సహించాలని కోరారు.
ప్రాణరక్షక ఔషధాలు సామాన్యులకూ అందాలి
ప్రాణాలను రక్షించే అత్యాధునిక మందులు నిరుపేదలకు సైతం అందుబాటు ధరల్లో దకేలా ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు చొరవ చూపాలని, క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే నొప్పి నివారణ మందులకు కొరత లేకుండా చూడాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కరోనా లాంటి మహమ్మారులను దృష్టిలో పెట్టుకుని అత్యవసర వైద్యసేవలను జిల్లాల స్థాయికి విస్తరించాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య విపత్తులు వచ్చినా ఎదుర్కోగలిగేలా మౌలిక వసతులు, వైద్యవ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. తెలంగాణలో మెడికల్ కళాశాలలు, దవాఖానల విస్తరణ ద్వారా గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువయ్యాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు జగదీశ్, వాసుదేవ్, మనోహర్‌రెడ్డి, ప్రతీక్, స్పర్శ్ హాస్పిస్ ట్రస్టు సభ్యులు, నర్సింగ్ సిబ్బంది, దాతలు, అనేక మంది రోగుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

