ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 14: రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సోమవారం నుంచి జైళ్ల శాఖలో చేపట్టనున్న బదిలీల ను తక్షణమే నిలిపివేయాలని దక్షి ణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. తార్నాకలోని ఆయన కార్యాయలంలో ఆదివారం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి క్యాడర్‌గా ఉన్న వార్డర్స్, బగ్లర్స్ పోస్టులను తెలంగాణలో జిల్లా క్యాడర్‌గా మార్చి 2021 డిసెంబర్ 6న వివిధ జిల్లాలకు బదిలీ చేశారని వివరించారు.
కాంట్రిజియస్ జీవో 54 ప్రకారం వీరిని జోనల్ విధానంలో సొంత జిల్లా నుంచి బదిలీ చేయనున్నారని చెప్పారు. ఐజీ స్థాయి అధికారులు దశాబ్దాలుగా ఒకే దగ్గర విధులు నిర్వర్తిస్తుండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన వీరిని తెలంగాణలో సొంత జిల్లాలకు బదిలీ చే శారని గుర్తు చేశారు. నాలుగేళ్లు పూర్తికాకు ండానే బదిలీలను చేపడుతున్నారని ఆరోపించారు. వారికి న్యాయం జరిగే వర కు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.