హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వెంటనే జనాభా లెక్కల షెడ్యూల్ విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం ఎన్డీయే కూటమి సమావేశంలో హ ర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కులగణనకు మద్దతు ఇచ్చే తీర్మానాన్ని ప్రతిపాదించారని పేర్కొన్నారు.
2020-21లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. జనాభా లెక్కలను ఎప్పటివరకు పూర్తి చేస్తామనే విషయాన్ని కేంద్రం చెప్పడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. జనా భా లెక్కలు ఎప్పుడు చేపడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.