హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య 50 వసంతాలను పురస్కరించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండురోజులపాటు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల గౌరవ అధ్యక్షురాలిగా విమలక్కను ఎంపిక చేశారు.
తెలంగాణ అధ్యక్షుడిగా ఏపూరి మల్సూర్, ప్రధాన కార్యదర్శిగా పోతుల రమేశ్, ఉపాధ్యక్షులుగా సీ అనితాకుమారి, ఎస్ ప్రభాకర్, సురేశ్, సహాయ కార్యదర్శులుగా రాకేశ్, నూతన్, కోశాధికారిగా భాసర్నాయక్, కార్యవర్గసభ్యులుగా చిన్నన్న, రామన్న పాల్, తుడుం స్వామి, హరికృష్ణ, కుర్తె లింగం, గంగారత్నం, మహమ్మద్ ఆఫీజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.