యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం తీవ్ర నిరసనల మధ్య కొనసా గుతున్నాయి. తాజాగా జిల్లాలోని(Yadadri Bhuvanagiri) ఆత్మకూరు (ఎం) మండలం తిమ్మాపురంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అర్హులైన లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఆదివారం గ్రామంలో జరిగిన నాలుగు పథకాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసేందుకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని గ్రామంలో ఎంపికైన లబ్ధిదారులలో కొంతమందికి ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి వెళ్లిపోయారు.
అయితే అర్హత ఉండి కూడా జాబితాలో పేర్లు రాకపోవడంతో అర్హులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు పథకాలను అర్హులందరికి అందజేయాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.