Kasipeta | సోమగూడెంలో ప్రభుత్వ భూమి కబ్జా.. అడ్డుకున్న గ్రామస్తులు
సోమగూడెం రహదారి పక్కన గల సర్వే నెంబర్ 2పైక గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ట్రాక్టర్ తో చదును చేస్తుండగా లంబాడి తండా(కే) గ్రామస్తులు అడ్డుకున్నారు.
కాసిపేట, మే 25 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకేనపల్లి శివారులోని సోమగూడెం రహదారి పక్కన గల సర్వే నెంబర్ 2పైక గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ట్రాక్టర్ తో చదును చేస్తుండగా లంబాడి తండా(కే) గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని కొంత మంది పట్టాలు ఉన్నాయని వస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇది ప్రభుత్వ భూమిగా ఉందని, రెవెన్యూ శాఖ బోర్డులు కూడా పెట్టారని గ్రామస్తులు పేర్కొన్నారు.
సర్వే నెంబర్ పెద్దది కావడంతో పొజిషన్ వేరే దగ్గర ఉండగా రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమినే తమ భూమిగా చూపిస్తున్నారని, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని పేర్కొన్నారు. బెల్లంపల్లి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జీపీవోలు ప్రతిభ, దాస్ లు వచ్చి విచారణ చేపట్టారు. విచారణ చేసి సర్వే పూర్తి అయ్యే వరకు ఎటువంటి పనులు చేయరాదని సూచించారు. లంబాడితాండ(కే) సర్పంచ్ బోడ బలరాం ఆధ్వర్యంలో గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. ఇదిలా ఉండగా తమకు అన్ని పత్రాలు ఉన్నాయని మరో వర్గం వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

