కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కుబ్రే నర్సవ్వ, హన్మాండ్లు కూతురు అపర్ణ ( Aparna ) అనే విద్యార్థిని నీట్ పరీక్షలో మంచి 504 ర్యాంక్ సాధించి వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ( MBBS ) సీటును పొందింది. గ్రామం నుంచి ఎంబీబీఎస్కు ఎంపికైనమొట్ట మొదటి విద్యార్థిని అపర్ణ కావడం విశేషం. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆదారపడి జీవిస్తున్న కుటుంబం.
ఈ సంద్భంగా గ్రామం నుంచి మెడికల్ సీటు సాధించిన మొదటి విద్యార్థిని అపర్ణను ఉపాధ్యాయులు, గ్రామస్థులు శనివారం ఘనంగా సన్మానించారు. నాలుగో తరగతి వరకు పల్సి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ఐదు నుంచి ఇంటర్ వరకు ఇచ్చోడలోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో చదివిన ఆమెను మెడికల్ సీట్ సాధించడం అభినందనీయమని , గ్రామంలోని మిగతా విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు. ఈ సంద్భంగా ఆమెను శాలువాలతో సత్కరించి అభినందించారు.