మహదేవపూర్, జనవరి 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీలో ఉపాధి కోసం గురువారం ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలో తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇసుక డంపింగ్ తమ గ్రామ శివారులో ఉందని, టీజీఎండీసీ అధికారులు, క్వారీ నిర్వాహకులు బొమ్మాపూర్లోనే క్వారీ ఏర్పాటు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ ఇసుక క్వారీ బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో నడువగా ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరికిందని గుర్తు చేశారు. బొమ్మాపూర్లోనే క్వారీ ఉందని తమ గ్రామస్తులకు మాత్రమే ఇసుక క్వారీలో ఉపాధి పొందే అవకాశం ఉందని తేల్చి చెప్పడంతో చేసేదేమీలేక నిర్వాహకులు ఇసుక లోడిండ్ పనులు నిలిపివేశారు.