కేశంపేట, నవంబర్ 8 : రేషన్ బియ్యం బస్తాలో తలంబ్రాలు, రంగురంగుల బాల్స్ వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధనలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డీలర్ అనిత శనివారం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా ఓ బస్తాలో పసుపు రంగుతోపాటు రంగురంగుల బాల్స్ వచ్చాయి.
మరికొన్ని తెరిచినా అవే రావడాన్ని చూసి లబ్ధిదారులు కంగుతిన్నారు. డీలర్ గోదాం నిర్వాహకులకు ఫోన్‌చేసి అడగ్గా తాము తయారు చేయలేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్టు తెలిసింది.