సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 16: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, ఆయన బారి నుంచి రక్షించాలని సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొత్తగూడేనికి చెందిన గణం అంజయ్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శనివారం రాత్రి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని అభివృద్ధిపై గ్రామస్థులతోపాటు అంజ య్య నిలదీశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి గూండాలతో దాడి చేయించారని అంజయ్య పేర్కొన్నారు. అక్కడే ఉన్న పోలీసులు దాడి నుంచి రక్షించార న్నారు. రాజగోపాల్‌రెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.