రేగోడ్, జూలై 16 : బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విధ్వంసమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం దోసపల్లిలో మంగళవారం రాత్రి అధికార పార్టీకి చెందిన బడానాయకుడు ప్రకృతి వనాన్ని తొలగించాడు.
జేసీబీతో రాత్రికి రాత్రే ప్రకృతి వనాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. దీనిపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుచ్చయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, గ్రామస్థులు ఎంపీడీవో, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.