నల్గొండ : చింతపల్లి మండలం మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ (32) మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో ఆయన తండ్రి మాన్య నాయక్ (50) సైతం ప్రాణాలు కోల్పోయారు. వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్యతండా. డిసెంబర్ 26న శ్రీనునాయక్ వివాహం జరగ్గా.. శనివారం ఒడిబియ్యం కార్యక్రమం ముగుంచుకుని స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా శ్రీనునాయక్ ఆటోను నడిపారు. ఆయన తండ్రి తండ్రి ఆటో మాన్య డ్రైవర్. ఇటీవల తండ్రి చేతికి గాయంకావడంతో ఆటోను నడుపగా.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. తండ్రి కొడుకుల మృతితో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకున్నది.