వికారాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : లగచర్ల ఘటనపై విచారణ సాగుతున్నట్టు అదనపు డీజీ మహేశ్‌భగవత్ మీడియాకు వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు ఎస్పీ నారాయణరెడ్డితో వేర్వేరుగా రెండు గంటలపాటు సమావేశమై ఘటన జరిగిన తీరుపై చర్చించినట్టు తెలిసింది. ఈ ఘటనలో 47 మందిని నిందితులుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు శుక్రవారం వరకు 21 మందిని రిమాండ్‌కు తరలించగా, శనివారం మరో ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
వికారాబాద్, నవంబర్ 16 : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ప్రభుత్వం మరింత భద్రత కల్పించింది. ఇప్పటివరకు ఇద్దరు గన్మెన్లు ఉండగా.. ఇటీవల లగచర్లలో కలెక్టర్‌పై దాడి జరిగిన నేపథ్యంలో మరో ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో గన్మెన్ల సంఖ్య నాలుగుకు చేరింది..