హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబు డర్టీ పొలిటిషియన్ అని, కేసీఆర్ ఆ మాట ఎప్పుడో చెప్పారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ మద్యం వ్యవహారంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో 13 గంటలపాటు ఈడీ సోదాలు జరిగాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో పార్టీ ప్రకటించి మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు.
మీడియా రంగంలోకి వచ్చి చంద్రబాబు అవినీతిని ఎండగడుతానని పేర్కొన్నారు. చంద్రబాబు నెలకు రూ.5వేల కోట్లు సంపాదిస్తున్నారని, ఏడాదికి వేల కోట్లను విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లోనే ఈడీ సోదాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.