హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. యాదాద్రికి మాత్రం మార్చి వరకు మినహాయింపునిచ్చింది. తిరుమల లడ్డూ వివాదం అనంతరం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయ నెయ్యిని మాత్రమే వాడాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ప్రభుత్వ ఉత్తర్వులను ఉ ల్లంఘించి ప్రైవేటు డెయిరీతో ఒప్పం దం చేసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులపై చర్యలు తీసుకున్న ప్రభు త్వం.. ఇతర ఆలయాల్లో నెయ్యి సరఫరాపై సమీక్షించి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించింది. ఇతర డె యిరీలతో ఉన్న ఒప్పందాలను వెం టనే రద్దు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రిలో స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు మార్చి చివరి వరకు మదర్ డెయిరీ నెయ్యి సరఫరా కానుంది.