హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవు పాల ధరను తగ్గించి.. బర్రె పాల ధరను లీటర్కు రూ.4 వరకు పెంచేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. విజయ డెయిరీ ప్రతీరోజూ 4.5లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. అందులో 85శాతం మేరకు ఆవు పాలు ఉంటున్నాయి.
ప్రైవేట్ డెయిరీ సంస్థలు ఆవు పాలు లీటర్కు రూ.32 నుంచి రూ.33 వరకు చెల్లించి సేకరిస్తున్నాయి. విజయ డెయిరీ మాత్రం రూ.42 ఇస్తున్నది. బర్రె పాలు లీటర్కు రూ.48 చెల్లిస్తున్నది. ఆవుపాల సేకరణతో సంస్థకు ఆదాయం కంటే నష్టమే ఎకువ వస్తున్నదని అధికారులు పేరొంటున్నారు. దీంతో ఆవు పాల ధరలను తగ్గించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. విజయ డెయిరీ సంస్థకు దాదాపు రూ. వెయ్యి కోట్ల టర్నోవర్ ఉన్నది. ప్రతినెలా రూ.13కోట్లపైగా నష్టాలు వస్తున్నట్టు సమాచారం.