హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : విజయ డెయిరీ చైర్మన్‌గా నియమితులైన సోమ భరత్ కుమార్ మంగళవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సతరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చొరవతో ప్రస్తుతం రూ.700 కోట్ల టర్నోవర్ సాధించినట్టు మంత్రి తలసాని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉన్నదని పేర్కొన్నారు. మరిన్ని ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు మంత్రి తలసాని వివరించారు.