నెక్కొండ, అక్టోబర్ 12 : పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గటిక విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెరిక సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని కోకాపేట పెరికకుల ఆత్మగౌరవ భనవంలో జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు విజయ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పెరిక కుల ఆత్మ గౌరవ భవన కమిటీ చైర్మన్‌గా సుందరి భాస్కర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ ముదినేని వీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాంభద్రయ్య, బండి పుల్లయ్య, సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మద్దా లింగయ్య, దాసరి మల్లేశం, శ్రీరామ్ దయానంద్, నాయకులు చుంచు ఊషన్న తదితరులు పాల్గొన్నారు.