చిన్న ప్యాకెట్లను విడుదల చేసిన మంత్రి తలసాని
హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విజయ డెయిరీ పలు ఉత్పత్తులను చిన్న ప్యాకెట్లలో తీసుకొస్తున్నది. విజయ డెయిరీ నుంచి రూ.10, రూ.20కి లభించే స్పెషల్ గ్రేడ్ అగ్మార్క్ నెయ్యి చిన్న ప్యాకెట్లను పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేశారు. భవిష్యత్తులో మరికొన్ని ఉత్పత్తులను చిన్న ప్యాకెట్లలో తీసుకొస్తామని, అవుట్లెట్ల సంఖ్యను పెంచుతామని తలసాని తెలిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మార్కెటింగ్ జీఎం మల్లిఖార్జున్, అధికారులు మల్లయ్య, కామేశ్, అరుణ్ పాల్గొన్నారు.
అధార్ సిన్హాను సన్మానించిన మంత్రి
మంగళవారం పదవీ విరమణ చేసిన పశు సంవర్ధకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధార్సిన్హాను మంత్రి తలసాని సన్మానించారు. పశు సంవర్ధకశాఖ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుకు ఆయన కృషి చేశారని మంత్రి ప్రశంసించారు.