హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించిన కేసులో టాలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను నాలుగున్నర గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న నగదు, కమిషన్లపై ఆరా తీశారు.
విజయ్ స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడు తూ.. తాను గేమింగ్ యాప్‌నే ప్రమో ట్ చేసినట్టు తెలిపారు. గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు తేడా ఉందని వెల్లడించారు. తాను ఏ3 అనే గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేసినట్టు అధికారులకు చెప్పానని పే ర్కొన్నారు. సదరు కంపెనీతో తాను చే సుకున్న ఒప్పందం వివరాలను ఈడీకి వెల్లడించినట్టు ఆయన తెలిపారు.