వరంగల్చౌరస్తా, నవంబర్ 24 : కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. వైద్య విద్య పీజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని ఐదుగురు విద్యార్థులకు అక్రమంగా మార్కులు కలిపి ఉత్తీర్ణులను చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఇద్దరు అడిషనల్ డీఎంఈస్థాయి అధికారులతో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీచేసింది.
గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య.. డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు.