హైదరాబాద్, ఏప్రిల్10(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా ఎన్వీఎస్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు, గురువారం మరో నలుగురిని ప్రభుత్వ రంగ సంస్థలకు ఎండీలుగా నియమించినట్టు సమాచారం. స్త్రీనిధి ఎండీగా విద్యాసాగర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఎన్సీగా కనకరత్నం, మిషన్ భగీరథ ఈఎన్సీగా కృపాకర్‌రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా గణపతిరెడ్డికి పోస్టింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
అయితే ఈ ఉత్తర్వులను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. గతంలో అవినీతి ఆరోపణలు వచ్చిన చోటే, మళ్లీ బాస్‌లుగా నియమిస్తూ పోస్టింగులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.