నాగర్ కర్నూల్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) డిమాండ్ చేశారు. డీజీపీ స్థాయి మహిళా అధికారి సమక్షంలో మెజిస్ట్రేట్ ఎదుట బాధిత అమ్మాయి, ఆమె తల్లి స్టేట్మెంట్ ( Victim Statement ) ను రికార్డు చేయాలని, బండి భగీరథ్ ( Bandi Bhagirath ) ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
బండి భగీరథపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులను వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. బాధితురాలికి సరైన న్యాయం చేయడమే కాకుండా.. వారి కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ను కాపాడాలని చూస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టిస్తున్న కేసుపై కాంగ్రెస్ నాయకులు, మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.