రామడుగు, సెప్టెంబర్11: సాయం చేయకుండా చేసినట్లు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నేతల తీరుపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన గోవింద్ దుబాయిలో అనారోగ్యానికి గురైతే, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సాయం అందించారని మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టా రు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన గోవింద్ సోదరుడు శంకర్ బుధవారం పెట్టిన వాయిస్ రికార్డు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొ డుతున్నది. ‘చెయ్యని సాయానికి మా ఇజ్జత్ తీసుకుంట కాంగ్రెసోళ్లు గ్రూపుల్లో పోస్టులు పెట్టిండ్రు. మాకు ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడూ పైసలివ్వలే. మా అన్న దుబాయ్లో షుగర్ వ్యాధితో బాధపడుతుండగా, అక్కడే పనిజేసే మా తమ్ముడు అధికారుల చుట్టూ తిరిగితే, అక్కడి దవాఖానలో పనిచేసే ఆంధ్రా డాక్టర్ మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వడంతో మా సొంత పైసల్తోని మా అన్న ఇంటికి జేరిండు.’ అంటూ వాయిస్ రికార్డు పెట్టారు.