జడ్చర్ల టౌన్/వెల్దండ, డిసెంబర్ 5 : బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు విచారణ జరిపి గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని రాగలత, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విద్యార్థిని ఫిర్యాదు చేసింది.
దీంతో జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కాగా.. అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ శ్యాంపూరి చెన్నయ్యను సస్పెండ్ చేస్తూ డీఆర్డీవో చిన్న ఓబులేశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధి పథకంలో విధులు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన అధికారులు సస్పెండ్ చేస్తూ నోటీస్ జారీచేశారు.