హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి రాజ్‌భవన్ చేరుకొని గవర్నర్ ఏర్పాటుచేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా హాజరయ్యారు. అనంతరం రాధాకృష్ణన్ రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటుచేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరై శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.