యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడితో పాటు విష్ణు మూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం స్వామివారికి కదంభం నివేదన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం 7.30 గంటలకు స్వామివారిని దివ్యమనోహరంగా అలకంరించి విశ్వక్సేన పూజలను నిర్వహించి పుణ్యాహవచనం, చంద్ర అవాహ నం, చంద్రదర్శనం గావించారు. అనంతరం చతుర్వేదపారాయణాలు స్వామివారికి విన్నవించి, స్వామివారికి ఆష్టోత్తర శత నామంతో అర్చనలు చేశారు.
నాలుగు వేదాలతో స్వామి వారిని కొనియాడుతూ దివ్య ప్రబంధనం సమర్పించారు. స్వామివారి విశేషాలను వేద మంత్రో చ్ఛారణలతో భక్తులను విన్నవించారు. అనంతరం స్వామివారికి తిరునక్షత్ర మహోత్సవం నిర్వహించి నివేదనతో ముగిం పు పలికారు. స్వామివారికి నిర్వహించే సువర్ణ పుష్పార్ఛనలో భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు. శ్రావణమాసం కావ డంతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేపట్టారు. క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి చెంత గల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకిం చారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేధ్యం గా సమర్పించారు.
ఉద్యోగ విరమణ పొందిన ముఖ్య అర్చకుడికి ఘన సన్మానం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో ముఖ్య అర్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్న గట్టు యాదగిరిస్వామి మంగళ వారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్. గీత అర్చకుడిని శాలువాతో సన్మానించి, వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్ బాబు, విశ్రాంత అర్చకులు కారంపూ డి నరసింహాచార్యులు, ఎంఈవో జె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.