గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 00:26:44

సీనియర్‌ జర్నలిస్ట్‌ సుంకన్న మృతి

సీనియర్‌ జర్నలిస్ట్‌ సుంకన్న మృతి

గద్వాల, నమస్తే తెలంగాణ: సీనియర్‌ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ నడిగడ్డ విలేకరి సుంకన్న(66) బుధవారం సాయంత్రం మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1979లో జర్నలిస్టుగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన దాదాపు 41 ఏండ్లపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు. నమస్తే తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులపై అనేక కథనాలు అందించారు.  సుంకన్న మృతి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని లోటని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సమైక్యపాలనలో పాలమూరు సాగు నీటి గోసను సుంకన్న ఆవిష్కరించిన తీరును మంత్రి గుర్తుచేసుకున్నారు. సుంకన్న మృతిపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సమరసింహారెడ్డి, సమాచార హక్కు కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి సంతాపం తెలిపారు.  


logo
>>>>>>