Weather Update | రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి (Weather Update). కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోతగా కురిసిన వానలతో జన జీవనం స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతునాయి. మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల విచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి తోడు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల విస్తాయని పేర్కొంది.