హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 21నుంచి 24వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్సీ సోమవారం తెలిపింది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది.
వెబ్ ఆప్షన్లకు 20 నుంచి లింక్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉన్న చెక్ లిస్ట్, అటెస్టేషన్ ఫారమ్‌లను డౌన్లోడ్ చేసి తీసుకురావాలని సూచించింది.