నాంపల్లి కోర్టులు, మే 9 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావును అదుపులోకి తీసుకుని విచారించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన నాన్‌బెయిలబుల్ వారంట్ పిటిషన్‌పై ఇన్చార్జి కోర్టు శుక్రవారం తీర్పును ప్రకటించనుంది. ప్రభాకర్‌రావు తరఫున మెమో దాఖలు చేసిన న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.
ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఏసీపీ వెంకటగిరి, డీసీపీ వెస్ట్‌జోన్, కమిషనర్ ఆఫ్ పోలీస్‌లు మార్చి 22, 23న ఫోన్ ద్వారా ప్రభాకర్‌రావును సంప్రదించారని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అమెరికా, భారత్‌కు చెందిన మొబైల్ నంబర్లకు చెందిన స్క్రీన్‌షాట్ ప్రతులను జతపర్చినట్టు పేర్కొన్నారు. ఈ నంబర్లకు ఏ సమయంలో ఫోన్ చేసినా తాను విచారణకు సిద్ధంగా ఉంటానని వివరించారు. తనకు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు.