నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 5 : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎల్ఎల్బీసీ సొరంగంలో వెంటిలేషన్ పనులు ము మ్మరంగా సాగుతున్నాయి. శనివారం రెస్క్యూ బృందాలు వెంటిలేషన్ పనులు చేపట్టారు. ప్రమాదస్థలం నుంచి సొ రంగం లోపలికి 100 మీటర్ల పొడవుl కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించారు. టన్నెల్‌లోని స్టీల్ తొలగింపుతోపాటు మట్టి తవ్వకాలు చేపట్టి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు.
ఘటన జరిగి 40 రోజులు దాటినా ఆరుగురి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ట న్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర్ రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్సిం గ్, సింగరేణి రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.