మోర్తాడ్, మే 7 : పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పాలన చేతగాని రేవంత్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలి, కానీ రాష్ట్రం గు రించి దివాలాకోరు మాటలు మాట్లాడొద్దని సూచించారు. అందాల పోటీలు కాదు.. ఫెయిల్యూర్ సీఎంల పోటీలు పెడితే దేశంలో నంబర్‌వన్ ర్యాంక్ రేవంత్‌రెడ్డికి రావడం ఖాయమని ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం వేముల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరితే.. ‘అప్పు పుడ్తలే, నన్ను కోసుకుని తినుండ్రి’ అని మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. సొంత రాష్ర్టాన్ని బద్నాం చేసే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని విమర్శించారు. వెంటనే రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించేసి పార్టీలో అర్హులైన శ్రీధర్‌బాబు, ఉత్తమ్, భట్టి లాంటి వారికి అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. అధికారంలోకి రావడం కోసం రేవంత్‌రెడ్డి లెక్కలేని హామీలు ఇచ్చాడని, కానీ ఒక్కహామీ సక్రమంగా అమలుచేయడం లేదన్నారు.