రేవంత్.. నిన్ను బొందపెట్టడం ఖాయం
‘అధికారమదంతో విర్రవీగుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డీ..నిన్ను..నీ పార్టీని రెండేండ్లలో ప్రజలు బొందపెట్టడం ఖాయం’అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
- సొంత నియోజకవర్గంలో చెప్పుకొనేందుకు ఏమీలేక ముఖ్యమంత్రి చిల్లర మాటలు
- సీఎం అసందర్భ ప్రేలాపనలపై మాజీ మంత్రి వేముల ధ్వజం
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): ‘అధికారమదంతో విర్రవీగుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డీ..నిన్ను..నీ పార్టీని రెండేండ్లలో ప్రజలు బొందపెట్టడం ఖాయం’అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓటమి తప్పదని తెలిసే అసహనంతోనే అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి వెళ్లి చేసిన పనులు చెప్పుకొనేందుకు ఏమీలేక చిల్లర మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు.
మూడేండ్ల పాలనలో విఫల ముఖ్యమంత్రిగా పేరు మూటగట్టుకున్న రేవంత్ అసహనం రోజురోజుకూ పెరిగిపోతున్నదని దెప్పిపొడిచారు. అన్నారం, సుందిళ్ల నుంచి నీటిని పంపింగ్ చేయవచ్చని కేంద్ర సంస్థ చెప్పినా సిగ్గులేకుండా కేసీఆర్‌పై నెపంనెడుతున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు.
11న నిర్మల్ రైతుగర్జన సభకు కేటీఆర్ రాక..
కాంగ్రెస్‌పై రైతులు సమరశంఖం పూరించనున్నారని, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 11న నిర్మల్‌లో రైతుగర్జన సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రైతుగర్జన సభావేదిక పనులను మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి ప్రారంభించారు. 11న జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

