నందలాల..గోవర్ధన లీల
వ్రజభూమిలో నందమహారాజు నాయకత్వంలో వ్రజవాసులు ప్రతి సంవత్సరం వర్షాల కోసం ఇంద్రయాగం జరిపేవారు. అయితే, శ్రీకృష్ణుడు తన తండ్రి నందమహారాజును కర్మ సిద్ధాంతం గురించి ప్రశ్నిస్తూ, ప్రతీ జీవికి వారి స్వకర్మల ప్రకారమే ఫలితాలు లభిస్తాయని వివరించాడు
వ్రజభూమిలో నందమహారాజు నాయకత్వంలో వ్రజవాసులు ప్రతి సంవత్సరం వర్షాల కోసం ఇంద్రయాగం జరిపేవారు. అయితే, శ్రీకృష్ణుడు తన తండ్రి నందమహారాజును కర్మ సిద్ధాంతం గురించి ప్రశ్నిస్తూ, ప్రతీ జీవికి వారి స్వకర్మల ప్రకారమే ఫలితాలు లభిస్తాయని వివరించాడు. తమ గోవులకు పచ్చికను, పశుగ్రాసాన్ని, జీవనాధారాన్ని అందిస్తున్న గోవర్ధన పర్వతమే ప్రత్యక్ష దైవమని కృష్ణుడు తెలిపాడు. వర్ష మేఘాలు గోవర్ధన పర్వత శిఖరాలను తాకడం వల్లే వర్షాలు కురుస్తున్నాయని, కాబట్టి ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతానికి, గోవులకు, బ్రాహ్మణులకు పూజ చేయాలని సూచించాడు. ఈ సంఘటన ఇంద్రుడి అహంకారాన్ని తొలగించి, భగవంతుడి ఉత్తమ భక్తుడైన గోవర్ధనుడిని పూజించే దివ్య గోవర్ధనోత్సవ ఆవిర్భావానికి పునాది వేసింది.
తన పూజ నిలిపివేశారనే అహంకారంతో, ఆగ్రహంతో ఇంద్రుడు ప్రళయాంతకమైన సంవర్థక మేఘాలను పంపి బృందావనంపై ఉగ్రమైన తుఫానును, పిడుగులతో కూడిన వర్షాన్ని కురిపించాడు. వ్రజవాసులు, గోపబాలురు, గోవులు ఈ ఆపద సమయంలో భయపడకుండా శ్రీకృష్ణుడినే సంపూర్ణ ఆశ్రయంగా ఎంచుకున్నారు. శ్రీకృష్ణుడు అపారమైన కరుణతో గోవర్ధన పర్వతాన్ని తన ఎడమచేతి చిటికెన వేలిపై సునాయాసంగా ఎత్తి, ఒక విశాలమైన దివ్య ఛత్రంలా (గొడుగులా) మార్చి గోకులవాసులందరికీ, గోవులకు సంపూర్ణ రక్షణ కల్పించాడు. ఈ లీల కృష్ణుడి అపారమైన దివ్య శక్తిని వ్యక్తపరుస్తూ, భగవంతుడిని శరణువేడిన భక్తులకు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాల నుంచైనా రక్షణ లభిస్తుందనే దృఢ విశ్వాసాన్నిఅందిస్తుంది.
ఏడు రోజుల ధారణ
శ్రీకృష్ణుడు ఏడు రాత్రులు, ఏడు పగళ్లు నిరంతరంగా గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ధరించి వ్రజవాసులకు అభయమిచ్చాడు. పర్వతం కింద గోపబాలురు తమ కరకర్రలతో పర్వతానికి సహకరిస్తున్నట్లు ఎత్తి పట్టుకోగా, వ్రజవాసులందరూ కృష్ణుడి దివ్య రూపాన్ని పరికిస్తూ, ముచ్చటించుకుంటూ ఆనందపరవశులయ్యారు. శ్రీకృష్ణుడు వారి మధ్యే నిలిచి అందరికీ తన దివ్య దర్శనాన్ని అందించాడు. ఈ ఘట్టం భక్తుల మధ్య పరస్పర సహకారం, ఐక్యత, ఈశ్వరుడిపై ఆధారపడే అచంచలమైన ఆధ్యాత్మిక తత్వాన్ని లోకానికి చాటిచెప్పింది.
అన్నకూట సమర్పణ
శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో వ్రజవాసులు రకరకాల అన్నాలు, పిండివంటలు, పాయసాలతో అన్నకూట పర్వతాలను సిద్ధం చేసి సమర్పించారు. గోవర్ధన గిరి కృష్ణుడి దివ్య రూపాన్ని తలపించే విశాల రూపంతో ప్రత్యక్షమై, ఇంకా తీసుకురండి అంటూ భక్తులు ప్రేమతో సమర్పించిన భోజ్యపదార్థాలన్నిటినీ స్వీకరించింది. ఈ అన్నకూట సమర్పణ ద్వారా భక్తులు తమకు లభించిన సంపదకు, ఆహారానికి భగవంతునికి నమ్రతతో, ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేసే సంప్రదాయం ఏర్పడింది.
శ్రీమద్భాగవతం గోవర్ధన పర్వతాన్ని ‘హరిదాసవర్యుడు’ (భగవంతుని భక్తులలో అత్యుత్తముడు) అని కీర్తించింది. గోవర్ధనుడు గోవులకు పచ్చికను, తీయని నీటిని, గోపగోపికలకు పండ్లు, గుహలు, విశ్రాంతి స్థలాలను అందిస్తూ 21 రకాల ఉపచారాలతో నిరంతరం సేవ చేశాడు. దీని నుంచి మనం స్వార్థరహితమైన సేవ, సహనం, ఇతర జీవులకు ఆశ్రయం ఇవ్వడం అనే ఆధ్యాత్మిక గుణాలను నేర్చుకోవాలి.
గోవర్ధన ప్రసాదం
పూజ అనంతరం గోవర్ధనుడు స్వీకరించిన అన్నకూట పదార్థాలన్నీ పవిత్ర ప్రసాదంగా మారి వ్రజవాసులందరికీ, సమాజంలోని అన్ని వర్గాలవారికీ, పశుపక్ష్యాదులకూ పంచారు. అన్నకూట ప్రసాదాన్ని అందరూ కలిసి స్వీకరించే ఈ సంప్రదాయం
ఉత్సవానికి ఆధ్యాత్మిక పవిత్రతను ఇస్తుంది. ఇది భక్తుల మధ్య ఉన్న భేదభావాలను తొలగించి, సాన్నిహిత్యాన్ని, సమానత్వ భావాన్ని, భక్తి ఆనందాన్ని పెంపొందిస్తుంది.
ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు
ఈ గోవర్ధన పూజ, అన్నకూటోత్సవాలను విశ్వవ్యాప్తి చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా నూతన తరాలకు భక్తి, గోసంరక్షణ, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ఆధ్యాత్మిక ఐక్యత అనే దివ్య సందేశం అందుతున్నది. హరే కృష్ణ నామాలను కీర్తించడం, జపించడం ద్వారా భక్తుల హృదయాలలో ‘కృష్ణ స్మరణ’ పెంపొందుతుంది.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
శ్రీ గిరిరాజ గోవర్ధనుడికీ జై! శ్రీ రాధా గోవిందకీ జై!!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

