హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వాధికారులకు అద్దెప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మె సైరన్ మోగించారు. రూ.170 కోట్ల బకాయిలను రాబట్టుకోవడంతోపాటు ప్రస్తుతం ఇసు ్తన్న నెలవారీ అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు.
బకాయిలు చెల్లించాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం, చీఫ్ సెక్రటరీకి వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు వెళ్తున్నామని తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్, జనరల్ సెక్రటరీ రాజు, వైస్ప్రెసిడెంట్లు అబ్దుల్, అయూబ్ అలీ వెల్లడించారు.