హైదరాబాద్/ఖైరతాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయమని అడిగినందుకు తెలంగాణ అద్దె వాహనాల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ అద్దె వాహనాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడేందుకు భారీగా అద్దె వాహనాల యజమానులు వస్తున్నారనే సమాచారంతో ప్రభు త్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది.
దీంతో వారందరినీ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్‌ను అరెస్టు చేసి మేడిపల్లి పీఎస్‌కు తరలించగా, జనరల్ సెక్రటరీ రా జును అరెస్టు చేసి యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోశాధికారి రవి, మ హబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రెహమాన్, ఇతర సభ్యులను ఎక్కడికక్కడ అరెస్టు చేశా రు.
2017లో కేసీఆర్ హయాంలో నెలకు రూ.34వేల వేతనం ఇచ్చేవారని, నాటి నుంచి నేటి వరకూ అవే వేతనాలు కొనసాగుతున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదని అసిసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్ మండిపడ్డారు.