బంజారాహిల్స్, డిసెంబర్ 2: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హైదరాబాద్‌కు చెందిన వీరభద్ర మినరల్స్ గ్రానైట్, జీవీపీఆర్ మినరల్స్ యాజమాన్యం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో నివాసం ఉంటున్న ఈ సంస్థల ఎండీ జీవీ ప్రతాప్‌రెడ్డి, ఆయన తనయుడు వీర దినేశ్‌రెడ్డి గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కిలో బంగారం కొనుగోలు కోసం రూ.50 లక్షల చెక్కును అందజేశారు.
స్వర్ణతాపడానికి రూ.1.80 లక్షల విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి విమాన గోపు రం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. వైటీడీఏ టెక్నికల్ కమిటీ సభ్యుడు బీఎల్ఎన్ రెడ్డి దంపతులు స్వామివారికి రూ.1.80 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు గురువారం యాదాద్రిలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి గట్టు శ్రవణ్‌కుమార్‌కు చెక్కు అందజేశారు.