హైదరాబాద్/వట్పల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా వట్పల్లి ఎస్సై లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటుపడింది. మల్టీ జోన్-2 ఐజీపీ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాల్సిందిగా ఐజీ వీ సత్యనారాయణ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి పుట్టినరోజు వేడుకలు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించడంపై నివేదిక అందిన వెంటనే క్రమశిక్షణ చర్యలు చేపడతామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. కాగా, ఎస్సైపై మాత్రమే చర్యలు తీసుకుంటే.. అన్నీతామై వ్యవహరించిన కిందిస్థాయి సిబ్బందిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసమర్థ పాల న సాగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. 200కు పైగా హత్య లు, 1900కు పైగా లైంగిక దాడులు జరిగాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 450మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నార ని ఆరోపించారు. రాష్ట్రంలో 15- 20లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారని, బాధితులను ఎప్పు డు ఆదుకుంటారో చెప్పాలని డిమాం డ్ చేశారు. టీచర్ల కొరతతో 1800 సూళ్లు మూతపడ్డాయన్నారు. గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా కాంగ్రెస్ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ డిక్లరేషన్, కులగణన ఏమైందని ప్రశ్నించారు. రోజూ వార్తల్లో నిలిచేందుకు హైడ్రా పేరిట హడావుడి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు.