హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం వేళ అకస్మాత్తుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరిక చేసింది.
గురువా రం భదాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మి వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో ఉద్యాన పంట లు చీడపీడలు సోకుతున్నాయని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పంట ల్లో నీరు నిలచి కాయకుళ్లు, మొక్కకుళ్లు, వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తున్నట్టు గుర్తించామని ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి తెలిపారు. వానలు తగ్గిన తర్వాత శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే పంటలను కాపాడుకోవచ్చని సూచించారు. కొ త్తగా నాటిన పండ్ల తోటల్లో మొక్కలను వెదురు కర్రలతో కట్టి వంగిపోకుండా జాగ్రత్తలు తీసు కోవాలని, వాన నీరు 48గంటల కంటే ఎ క్కువసేపు చెట్ల చుట్టూ నిలువకుండా చూసు కుంటే నష్టాన్ని నివారించవచ్చని చెప్పారు.
వర్షాల సమయంలో ఎరువులు వేయొ ద్దని ఆ తర్వాత మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటిలో కలిసి పిచికారీ చేయాలని సూచించా రు. మచ్చతెగులు నివారణకు తెగులు ఆశించిన కొమ్మలను, ఆకులను తీసివేసి కార్బెన్టిజం ఒక గ్రాము లీటర్ నీటిలో లేదా మాంకోజెట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చే యాలని సూచించారు. జామలో ఎండు తెగులు నివారణకు 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని ప్రతి చెట్టుకి వేయాలని సూ చించారు. వర్షాలు వెలిసిన వెంటనే నారుకుళ్లు, వేరుకుళ్లు సమ స్యలు తలెత్తకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా డైథాన్ 452 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.