జగదేవపూర్/ హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తేతెలంగాణ): ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ(90) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని వారి స్వగృహం దౌలాపూర్‌లో నిర్వహించారు. వజ్రమ్మ మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శోకతప్త హృదయులైన ప్రతాప్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. దుబ్బాక, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు కొత్తప్రభాకర్‌రెడ్డి, పాడికౌశిక్రెడ్డితో కలిసి దౌలాపూర్ చేరుకొని వజ్రమ్మ భౌతికాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. వారి కుమారులు వంటేరు సంజీవరెడ్డి, ప్రతాప్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.