హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఉదయం 12 గంటలకు శాసనమండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్‌రెడ్డి చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్సీలు హాజరవుతారు.