Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రె, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
రైతు భరోసా, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన రూ. 2500, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లాపూర్ మున్సిపాలిటీకి మంజూరైన నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, దీనివల్ల పట్టణ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేయడమే ధ్యేయంగా ఆ పార్టీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు.

Kollapur2
ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని, తాగునీటి సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని వారు ఆరోపించారు. స్థానిక నాయకత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీయేనని, సామాన్యుడి సంక్షేమం కోసం పనిచేసే కారు గుర్తు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చే తప్పుడు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. పట్టణం బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అనివార్యమని అన్నారు. .అభివృద్ధికి ఓటు – కారు గుర్తుకు ఓటు అనే నినాదంతో ప్రతి ఇంటికి డోర్ స్టిక్కర్లను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు స్వయంగా అతికించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kollapur3