రామంతాపూర్, నవంబర్ 27: మాదిగల ఇజ్జత్.. ఇమ్మత్.. భవిష్యత్తు బీఆర్ఎస్తోనేనని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ మణిపూర్లో ఆర్ఎస్ఎస్ గూండాలతో ఎస్టీ కోయ బిడ్డలను ఊచకోత కోసి విషయాన్ని బీసీలు, మైనార్టీలు మరువొద్దని సూచించారు. కాంగ్రెస్ గతంలో అధికారం చేజిక్కించుకోవడం కోసం హిందూ, ముస్లిం పేరుతో మతఘర్షణలు లేపి అధికారం చేపట్టిన విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. మాదిగలు అందరూ సీఎం కేసీఆర్కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.