ముషీరాబాద్, జూలై 13: పారిశుధ్య కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్చ భారత్కు కారణమవుతున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శనివారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పారిశుధ్య కార్మికుల సేవలను ప్రశంస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్నా వారి జీవన విధానం మారడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.