మషీరాబాద్, నవంబర్ 26: ఎస్సీ వర్గీకరణకు మాలలు మద్దతు ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని పేర్కొన్నారు. విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వంగపల్లి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవి స్తూ మాలలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు సహకరించాలని కోరా రు. నాయకులు శ్యామ్రావు, వెంకట్, చందు, నాగరాజు పాల్గొన్నారు.