ముషీరాబాద్, జూలై 2 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ట్రస్ట్ కమిటీలో మాదిగలకు చోటు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. దేవాలయ కమిటీలో పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించి మాదిగలను విస్మరించడమేందని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
గతంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీలోనూ మాలలకు అవకాశం కల్పించి, మాదిగలను పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఏనాడూ యాదగిరిగుట్ట గుడి మెట్లు ఎక్కని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు అవకాశం కల్పించడంపై మండిపడ్డారు.